Sunday, January 1, 2012

నా నేను

చాలా రోజుల తర్వాత నన్ను నేను తత్టిలేపుకుంటే
బద్ధకంగా లేచింది మనసు

మదిలోని భావాలను ఒక రూపంలోకి మలచడానికి
అక్షరాలను వెతకాల్సివస్తుంది

అద్దంలో నా ప్రతిబింబం నాకే కొత్తగా ఉంది

నగర జీవితపు ఛట్రంలో పడి నా ఉనికిని ఎక్కడో కోల్పోయాను
నాలోని స్పందనను మరిచాను

కిల్లర్ ఇన్స్టింక్ట్లల ప్రపంచంలో పడి నా ఆనుభూతులను కోల్పోయాను
నాలోని నవ్యతను కోల్పోయాను

ఆకాశమంత రెక్కలు వేసుకొని ప్రకృతీ అరుణిమల మధ్య, అనుభూతి,
ఆనందపు శిఖరాల మధ్య, కవి ప్రపంచంలో ఎగురాలని ఉంది

- రాజా వడ్డేపల్లి (17-11-1996)